తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి ప్రధాత దొడ్డి కొమురయ్య 75 వ వర్ధంతి

Published: Monday July 05, 2021
పరిగి 4 జులై పరిపాలన ప్రతినిధి: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దొడ్డి కొమురయ్య పోరాటం అజారామరం అని కురుమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వార్ల ఆంజనేయులు, పరిగి నియోజకవర్గ అధ్యక్షులు సురేష్ మండల అధ్యక్షుడు ఎల్లయొల్ల మల్లేశం అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో ఆదివారం దొడ్డి కొమురయ్య 75వ వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రజాకార్ల నుంచి తెలంగాణ జాతి విముక్తి కి వీరోచిత పోరాటం చేశారని గుర్తు చేశారు. వారి అక్రమాలు, అకృత్యాలను ఎదిరించిన మహానుభావుడాని కొనియాడారు. ప్రభుత్వం ఏటా ఆయన జయంతి, వర్ధంతిని అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో సంఘం మండల ఉపాధ్యక్షుడు కుర్వ లక్ష్మన్ సీనియర్ నాయకులు నర్సిములు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరేష్, నాయకులు ఆర్ మల్లేష్, దస్తప్ప, అంజయ్య పాల్గొన్నారు.