మౌలిక సదుపాయాలు ఉన్నప్పుడే ఆంగ్ల విద్యాబోధన సాధ్యం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Published: Wednesday January 19, 2022

జగిత్యాల, జనవరి 18 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణంలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ 2014 లో తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యా ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పి రెండు సార్లు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆంగ్ల విద్యా బోధనపై దృష్టి పెట్టకపోవడం హాస్యాస్పదంగా ఉందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆంగ్ల విద్యాబోధనను స్వాగతిస్తున్నామని కానీ ప్రతి స్కూలల్లో మౌలిక సదుపాయాల లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేసి ఉపాధ్యాయుల సంఖ్యను పెంచినప్పుడు మాత్రమే ఆంగ్ల భాష సాధ్యమవుతుందని అన్నారు. 2017 లో ఒక్కసారి మాత్రమే ఉపాధ్యాయుల నియామకం చేపట్టి ఇంత వరకు డిఎస్సి నోటిఫికేషన్ వేయకపోవడం ఉపాధ్యాయుల కొరత ఉండడం విద్యావాలంటీర్లను నియమించకపోవడం ఆంగ్ల విద్య బోధన ఎలా సాద్యమౌతుందని సీఎం కేసీఆర్ ను జీవన్ రెడ్డి ప్రశ్నించారు. 20 వేల టీచర్స్ ఉద్యోగాలు కాలిగా ఉన్నాయని మరో 20 వేల ఉద్యోగాలు ఆంగ్ల బోధనకు అదనంగా నియమించాలని ప్రభుత్వన్నీ డిమాండ్ చేస్తు సంవత్సరాలు గడుస్తున్న టెట్ నిర్వహించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యం కాద అని తిరుపతిరావు మరియు బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదికను పక్కనపెట్టి  మరో కొత్త కమిటీని నీయమించడం ఏంటని అన్నారు. 317 జీవోను పక్క దారి మళ్లించడానికే నూతనంగా స్కూలల్లో ఆంగ్ల విద్యా బోధనను తెరపైకి తీసుకువచ్చారని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొత్త మోహన్ బండ శంకర్ కల్లెపల్లి దుర్గయ్య గాజుల రాజేందర్ కొండ్ర జగన్ పులి రాము కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.