విద్యుత్ అధికారులతో మేయర్ జక్క వెంకట్ రెడ్డి అవగాహన సదస్సు

Published: Wednesday November 17, 2021
మేడిపల్లి, నవంబర్ 16 ప్రజాపాలన ప్రతినిధి : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న  భవనాలకు నిర్మాణ సమయంలో కరెంట్ బిల్లులు అధికంగా రావడం మరియు కేటగిరీలపై విజిలెన్స్ కేసులు నమోదు చేయడంపై కార్పోరేషన్ కార్యాలయంలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ అధికారులతో కలిసి బిల్డర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో విద్యుత్ ఏడీఈ శ్రీనివాస్ రెడ్డి పాల్గొని బిల్డర్లకు విద్యుత్ శాఖతో వస్తున్న సమస్యపై విద్యుత్ చౌర్యం కేసు బుక్ చేసి పెనాల్టీ, డెవలప్మెంట్ ఛార్జీస్, విజిలెన్స్ కేసులు, ట్రాన్స్ఫార్మర్స్ అప్లికేషన్, కన్స్ట్రక్షన్ కమర్షల్ మీటర్స్ మొదలగు విషయాలను గురించి అవగాహన కల్పించారు. మేయర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో ఎవ్వరు ఎలక్ట్రిసిటీ పోల్స్ కొరకు దరఖాస్తు చేసుకుంటే కచ్చితంగా 9 మీటర్స్ స్తంభాలు, 3ఫేస్ కరెంటు ఏర్పాటు చేయాలని, బిల్డర్స్ ట్రాన్స్ఫార్మర్స్ కొరకు దరఖాస్తు చేసుకుంటే 3ఫేస్ కరెంట్ తో పాటు స్ట్రీట్ లైట్ ఫేస్ మరియు హెచ్ టీ మరియు ఎల్ టి లైన్లు వేయాలని సూచించారు. ఈ అవగాహన సదస్సులో కార్పొరేటర్లు ఎంపల్ల అనంత్ రెడ్డి, దొంతిరి హరిశంకర్ రెడ్డి, ఏఈలు రాంరెడ్డి, వెంకటేశ్వర్లు, బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.రమేష్ , ప్రధాన కార్యదర్శి ఎస్.కరుణాకర్ రెడ్డి, బిల్డర్స్ సతీష్ రెడ్డి, సత్యనారాయణ, మురళీ, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.