విద్యాసంస్థల ముసివేతతో కరోనా అంతం కాదు.

Published: Monday January 17, 2022
మంచిర్యాల బ్యూరో‌, జనవరి 16, ప్రజాపాలన : విద్యాసంస్థల ముసివేతతో కరోనా అంతం కాదని, కరోనా పేరుతో పేద విద్యార్థులకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను దూరం చేస్తున్నయని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ అన్నారు. ఆదివారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రములోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 30 వరకు పెంచిన సెలవులు ప్రకటించిన నిర్ణయాన్ని విరమించు కోవాలని డిమాండ్ చేశారు. వైన్స్ లను, షాపింగ్ మాల్స్, క్లబ్లు, సినిమా థియాటర్లు, ప్రజలు ఎక్కువగా గుమికూడి ఉండే ప్రాంతాలలో కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశలు ఉన్నాయని అన్నారు. కరోనా రాకుండా నివారణ చర్యలు తీసుకోకుండా కేవలం విద్యాసంస్థలు ముసివేయడం వలన కరోనా వైరస్ అరికట్టడం సాధ్యం కాదని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందకుండా ప్రజలకు అవగాహన చేస్తూ, ఉచితంగా గ్రామాలలో మాస్కులు, శనిటైజర్ అందిస్తూ, ఉపాధి కోల్పోయిన ప్రజలకు అందరికి ప్రతి నెల నిత్యావసర సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.