నూతన సంవత్సర వేడుకలకై కట్టుదిట్టమైన బందోబస్త్

Published: Saturday December 31, 2022
 –జిల్లా ఎస్‌పి ఎన్. కోటి రెడ్డి 
వికారాబాద్ బ్యూరో 30 డిసెంబర్ ప్రజాపాలన : నూతన సంవత్సర వేడుకలకు సంబందించి పోలీస్ డిపార్ట్మెంట్ తరపున సలహాలు సూచనలు పత్రికాముఖంగా స్పష్టం చేస్తున్నామని వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డి అన్నారు. వాటిని ప్రతి ఒక్కరూ తప్పని సరిగా పాటించి శాంతి భద్రతలకు విఘాతం కల్పించరాదని సూచించారు. డి‌జే, సౌండ్ బాక్స్ లకు, పెద్ద పెద్ద శబ్దాలకు  ఎలాంటి అనుమతులు లేవు. రిసార్ట్, ఫామ్ హౌస్ లపై ప్రత్యేకమైన నిఘా వుంటుంది. రిసార్ట్, ఫార్మ్ హౌస్ లలో  ఎలాంటి ఆశ్లీలత కార్యక్రమాలు జరపకూడదు. మద్యం త్రాగి, రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, చేసిన వారిపై వాహన నియమ నిబందలను పాటించకుండా వాహనాలు నడిపిన వారిపై వాహనాలు సీజ్ చేసి చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 31 డిసెంబర్ అర్దరాత్రి సమయం లో నూతన సంవత్సరం వచ్చిన సందర్బంగా ఎవ్వరూ కూడా ర్యాలీలు, బైక్ ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదు. 31 రాత్రి నుండి నూతన సంవత్సరం ఉదయం సమయం వరకు జిల్లా లో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నాకాబందీ, వాహన తనిఖీలు,  డ్రంక్ & డ్రైవ్ టెస్ట్ లు వంటి పలు చర్యలు  నిర్వహించడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారుల నిరంతరం పకడ్బందీ పెట్రోలింగ్, బందో బస్త్ లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోలీస్ అధికారులు పై తెలపబడిన విధులు నిర్వహించే సమయం ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే అట్టి సంఘటనలను వీడియో లు చిత్రీకరించి కేసులు నమోదు చేయడం జరుగుతుంది.
ఎవరైనా నూతన సంవత్సర వేడుకలు పెద్ద ఎత్తున చేస్తే వారు  పోలీస్ డిపార్ట్మెంట్ ఇతర శాఖల నుండి అనుమతులు తప్పనిసరిగా తీసుకొని వాటిని పాటించాలి. బహిరంగ ప్రదేశాలలో ఎవరైనా వేడుకలు జరుపుకొని, వేడుకల పేరుతో ఇతరులకు ఇబ్బందులు గురిచేసిన యెడల అట్టి వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోలీసు శాఖ నుండి వెలువడిన సూచనలు సలహాలను  అతిక్రమించిన వారిపై ప్రజా భద్రత రీత్యా చట్టపరమైన చర్యలను తీసుకోవడము జరుగుతుంది. పై సూచనలు పాటించి జిల్లా ప్రజలు పోలీస్ అధికారులకు పూర్తిస్థాయిలో తమ సహాయ సహకారాలు అందించాలని, డిసెంబర్  31 రాత్రి  రోజున మద్యం మత్తులో వాహనాలపై యువకులు రాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు లోనూ అయి సంతోష కరమైన రోజుని విషాద కరంగా చేసుకోవద్దు.  కొత్తరకం కరోనా వ్యాధి ప్రపంచం మొత్తం హడలిస్తున్న సందర్బంగా  ప్రతి యొక్కరు మాస్క్ లు, శానిటైజర్ లు ఉపయోగించి భౌతిక దూరం పాటిస్తూ వ్యక్తిగత భద్రతతో సంతోష కరంగా, సురక్షితంగా నూతన సంవత్సర వేడుకలను  తమ తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో  కలసి జరుపుకోవాలని, ఎల్లపుడూ ప్రజల శాంతిభద్రతలను కాపాడుతూ, ప్రజల మంచి కోరే  మీ వికారాబాద్ జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ తరుపున మనవి అని “మీ భద్రతే మా భాద్యత అని”  జిల్లా ఎస్‌పి గారు తెలిపినారు. ప్రజలకు ఏమైనా శాంతిభద్రతల సమస్య ఉంటే డైల్ 100 కి కాల్ చేయాలని తెలపడం జరుగుతుంది.
                                                                                                             .