మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శాంతి నిలయంలో పండ్లు పంపిణీ

Published: Saturday August 20, 2022
బోనకల్, ఆగస్టు 19 ప్రజా పాలన ప్రతినిధి:75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలోని శాంతి నిలయంలో దివ్యాంగ పిల్లలకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా 14 సంవత్సరాల లోపు దివ్యాంగ బాలికలకు యుక్త వయసు బాలికల పథకం కింద కిట్స్ 7 మంది పిల్లలకు పంపిణీ చేయడం జరిగింది. ఒక్కొక్క కిట్స్ లో జ్యూట్ బ్యాగ్,500 గ్రాముల నెయ్యి, 5కేజీల గోధుమలు, ఖర్జూర 1 కేజీ, ప్రోటీన్ బిస్కెట్స్ 750 గ్రాములు, ఐరన్ జింక్ సిరప్800 మిల్లీ లీటర్లు, కాల్షియం మల్టీ విటమిన్ టాబ్లెట్స్ 90 ఇవన్నీ కిడ్స్ లో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రావూరి రాధిక, ర్వే ఆర్ ఐ లక్ష్మణ్, ఎంపీడీవో బోడేపూడి వేణుమాధవ్, జూనియర్ అసిస్టెంట్ ఉమా, ఎస్సై తేజావత్ కవిత, సిడిపిఓ శారద శాంతి, ఏసి డిపిఓ కమల ప్రియ, డి సి పి ఓ విష్ణు వందన, పి ఓ ఐ సి సోనీ, సూపర్వైజర్ పి రమాదేవి, బోనకల్ సర్పంచ్భూక్యా సైదా నాయక్, వైస్ ఎంపీపీ గుగు లోతు రమేష్, అంగన్వాడీ టీచర్స్ రమాదేవి, శివ నాగేంద్రమ్మ లు పాల్గొన్నారు.