చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు జన్మదిన శుభాకాంక్షలు : టిఆర్ఎస్ యువ నాయకులు సామ ప్రభాకర్ రె

Published: Tuesday May 17, 2022

వికారాబాద్ బ్యూరో 16 మే ప్రజా పాలన : చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపామని టిఆర్ఎస్ యువ నాయకులు సామ ప్రభాకర్ రెడ్డి అన్నారు.  సోమవారం చేవెల్ల నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే కాలే యాదయ్యను వికారాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సామ రామచంద్రా రెడ్డితో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆప్యాయత అనురాగాలతో పలకరించి శాలువాతో సన్మానించామని పేర్కొన్నారు. సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ప్రజా సేవలో తరలించాలని ఆకాంక్షించారు. ప్రజాసేవే పెన్నిధిగా భావించి ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకున్నారని గుర్తు చేశారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని శుభాభివందనాలు తెలిపారు.