*అక్రమ అరెస్టులు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు* -ఎస్ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభ

Published: Thursday February 23, 2023

  రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం ఆబాద్ మండలం మదనపల్లి మాచన్పల్లి హైతాబాద్ గ్రామంలో కేటీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు అర్ధరాత్రి అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించిన సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ,
చందన్ వెళ్లి గ్రామంలో వివిధ కంపెనీలకు అప్పనంగా భూములను కట్టబెట్టి రైతులకు నష్టపరిహారము చెల్లించకపోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. భూములు నష్టపోయిన వారికి కేవలం పది లక్షల రూపాయలు ఎకరాకు ఇచ్చి కోట్లాది రూపాయలు అధికార పార్టీ నాయకులు కొల్లగొడుతున్నారని విమర్శించారు.  అసలైన రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా జాప్యం చేయటం ఏమిటని ప్రశ్నించారు. గత కొన్ని నెలలుగా చందన్ వెళ్లి భూ నిర్వాసితులు రోడ్డుపై ధర్నా చేస్తుంటే అధికారులు ఎమ్మెల్యే,  ఎంపీ, ప్రజాప్రతినిధులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరైనది కాదని విమర్శించారు. ప్రతిపక్షాల నాయకులను అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించడం ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని దుయ్యబట్టారు. నిజాం నవాబును తలపించే విధంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించడం సరైనది కాదని విమర్శించారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు..