మన ఊరు మనబడి పనులు వేగవంతం చేయాలి

Published: Thursday December 01, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 30 నవంబర్ ప్రజాపాలన : మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను వేగవంతం  చేసి డిసెంబర్ 15 నాటికి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మన ఊరు మనబడి పనుల పురోగతిపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో మొదటి విడతగా మంజూరైన 37 పాఠశాలల్లో ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ క్రింద చేపట్టిన ప్రహరి గోడలు, కిచెన్ షెడ్ లు, మరుగుదొడ్ల నిర్మాణాలతో పాటు ఇతర పనులన్నీ పూర్తిచేసి పాఠశాలలకు కలరింగ్ పనులు చేపట్టి అందంగా తీర్చిదిద్దాలన్నారు. మిగిలి ఉన్న పనులకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయని, పరిపాలనాపరమైన అనుమతులు, గ్రౌండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.  పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు ఇఇ లు, డీఈలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని అన్నారు.డిసెంబర్ 15 నాటికి అన్ని హంగులతో పాఠశాలలను సుందరీకరించి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి, డి ఆర్ డి ఓ కృష్ణన్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి. ఇరిగేషన్, టీఎస్ ఇ డబ్ల్యూ ఐ డి సి శాఖల ఇఇ లు,  డిఇ లు, ఏఇ లు తదితరులు పాల్గొన్నారు.