నాన్యత లోపంతో డబుల్ బెడ్రూం ఇండ్లు. ..బిజెపి పట్టణ అధ్యక్షులు సప్పిడి నరేష్

Published: Saturday August 20, 2022
మందమర్రి , ఆగస్టు19, ప్రజాపాలన:
 
నిరుపేదలకు ఇండ్లను నిర్మించి ఇచ్చే పథకం లో బాగంగా మందమర్రి పట్టణంలో నాన్యత లోపంతో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారని బిజెపి పట్టణ అధ్యక్షులు సప్పిడి నరేష్ ఆరోపించారు. శుక్రవారం పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కేవలం డబుల్ బెడ్ రూం ఇండ్లు కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం మాత్రమే , నాయకుల లబ్ధిల కోసం నిర్మాణం చేశారని అన్నారు. నాసిరకం పనులతో   ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. ఇప్పటికీ ఇండ్ల నిర్మాణం అంటూ  ఎనిమిది సంవత్సరాలు గడిసినా  ఇప్పటివరకు ఒక్క ఇంటిని కూడా పేదలకు ఇవ్వలేదని అన్నారు.  ఈ కార్యక్రమంలో సీనియర్  నాయకులు డివి దీక్షితులు, పట్టణ ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గొల్లపెల్లి ఓదెలు, ఉపాధ్యక్షులు కీర్తి శ్రీనివాస్ యువమోర్చా అధ్యక్షుడు ఓరుగంటి సురేందర్, మహిళా మోర్చా అధ్యక్షురాలు దాసరి నిర్మల, దళిత మోర్చాపట్టణ అధ్యక్షులు మార్త కుమారస్వామి, యువమోర్చా ప్రధాన కార్యదర్శి అభిలాష్, సందీప్ రామ్ లక్ష్మణ్, రాజేష్, శ్యాం బాబు, అక్కల పల్లె శ్రీకాంత్, కే. సుజాత, స్వప్న, సుశీల , సౌమ్య, తదితరులు  పాల్గొన్నారు.