చిన్నారి చైత్ర కుటుంబానికి మద్దతుగా రిలే నిరాహార దీక్షలు

Published: Thursday September 16, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 15, ప్రజాపాలన ప్రతినిధి : ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శివ కుమార్ సింగరేణి కాలనీ వాసులు, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న "రిలే నిరాహారదీక్ష" అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ ఎఫ్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు పి.శివకుమార్ పాల్గొని సంఘీభావం తెలియచేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్  శివ కుమార్ మాట్లాడుతూ ఈ సమాజంలో ఆడవాళ్ళు అర్థరాత్రి ఒంటరిగా నడిస్తేనే సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చినట్లు అని మహనీయులు అన్నారని, కానీ ఇవాళ ఆడవాళ్లు మిట్ట మధ్యాహ్నం బయట నడవలేని పరిస్థితి ఏర్పడిందని, ఇలాంటి సమాజంలో పసిపిల్లలు స్వేచ్ఛ గా బ్రతుకే హక్కు కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ఆడపిల్ల డుగ్గుడుగ్గుమని చిందులేస్తుంటే ఆటబొమ్మను చేసి చూడడం, పనిపాటలేని ఆ బిగ్ బాస్ ప్రోగ్రామ్ లో ఎవరు రోమాంటిక్ కపుల్స్ అవుతారా, రచ్చ ఎప్పుడు అవుతుందా అని చూడఢం... సిని హీరో ఆక్సిడెంట్ అయి హాస్పిటల్ లో చికిత్స పొందుతుంటే ఆయన బైక్ ఎన్ని లక్షలు విలువజేస్తుందో అని తెలుసుకోవడం కాదు ఇవాళ కావాల్సింది. ఒక మానవ మృగం 6 ఏళ్ల చైత్ర చిన్న పాపను చిదిమేస్తే ఇంత వరకు నిందితుని ఎందుకు శిక్ష పడేలేదని ఆలోచించలని అన్నారు. ఇంత దారుణంగా అత్యాచారం చేసి చంపిన రాజు అనే మానవ మృగాన్నీ కఠినంగా శిక్షించాలని, ఉరిశిక్ష వేయాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో  నాయకులు షైక్ మహమూద్, శంకర్ నాయక్, బస్వాత్, కిషన్, దేవి, అజిమ్ భాయ్, తదితరులు పాల్గొన్నారు..