వరద ముంపు బాధితులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించాలి బూర్గంపాడులో న్యూడెమోక్రసీ ఆధ్వర్యం

Published: Thursday October 20, 2022

సర్వేనెంబర్ 10 లో 6600 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నదని, ప్రభుత్వ అధికారులు తక్షణమే ఆ భూమిలో గోదావరి వరద ముంపు  బాధితులకి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ బూర్గంపాడులో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో బుధవారం భారీ ప్రదర్శన, తాహాసిల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించి 4 గంటలు ధర్నా నిర్వహించటం జరిగింది. అనంతరం డిప్యూటీ తాసిల్దార్ శివకుమార్ కి వినతిపత్రం ఇవ్వటం జరిగింది డిప్యూటీ తాసిల్దార్ శివకుమార్ మాట్లాడుతూ తాసిల్దార్ దృష్టికి తీసుకెళ్లి సర్వేనెంబర్ 10  భూమి సర్వే చేపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి మోర రవి మాట్లాడుతూ.. సర్వే నెంబర్ 10 లో ఉన్న ప్రభుత్వ భూమిని  6600 ఎకరాలు ఫారెస్ట్ లో కలుపుకున్నారని, వెంటనే రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించి, ప్రభుత్వ భూమిని వెలికి తీసి, గోదావరి వరద ముంపు బాధితులకి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరద ముంపు బాధితులు ఇక ఎంత మాత్రం ఆ కాలనీలలో నివసించలేక శాశ్వత పరిష్కారం కోసం గత రెండు నెలలకు పైగా అధికారులకు వినతి పత్రాలు ఇస్తూ, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేసినప్పటికీ, కనీసం  భూసేకరణ ప్రయత్నాలు చేయకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వ భూములు సర్వే నిర్వహించి, వరద బాధితులకు స్థలాలు కేటాయించి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, లేనియెడల ఫారెస్ట్ లో కలిపిన ప్రభుత్వ భూముల్లో ప్రజలే నివాసాలు ఏర్పాటు చేసుకొని సమస్యను పరిష్కరించుకుంటారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో IFTU మణుగూరు ఏరియా కార్యదర్శి  గౌని నాగేశ్వరరావు, అఖిలభారత రైతు కూలి సంఘం జిల్లా నాయకులు కుంజ కృష్ణ, జక్కుల రాంబాబు , వైయస్ రెడ్డి, వీరమళ్ల ఉమ, సత్యనారాయణ, బట్టు రవి, ఆర్ లక్ష్మి , అనంతలక్ష్మి, ముంతాజ్, మీనాక్షి , అలివేలు, చిన్నమ్మాయి, పాషా , రఫీ , మనోజ్, నరేష్ , దుర్గారావు, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.