ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన

Published: Monday January 02, 2023
అశ్వాపురం ( ప్రజా పాలన)
ఈరోజు మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా అశ్వాపురం జడ్పిటిసి సూది రెడ్డి సులక్షణ మరియు అశ్వాపురం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోడే అమరేందర్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ను కలిసి పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సూది రెడ్డి గోపి మరియు పిట్ట శ్రీనివాసరావు తదితరులు పాల్గొని విప్ రేగ  కాంతారావు కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసినారు.