ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 3ప్రజాపాలన ప్రతినిధి *గురునానక్ బీటెక్ విద్యార్థి వంశీ పటేల్ ను పర

Published: Friday November 04, 2022

గురు నానక్ కాలేజీ  యజమాన్యం వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్న బీటెక్ విద్యార్థి వంశీ పటేల్ ని నగరంలోని ఓమ్ని హాస్పిటల్లో పరామర్శించిన  తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇచ్చి ఓదార్చారు, హాస్పిటల్ యజమాన్యం డాక్టర్ జైపాల్ రెడ్డి గారితో మాట్లాడి ఉన్నత వైద్యం అందించాలని కోరారు, విద్యార్థులు ఎవరు కూడా క్షణకావేశాలకు లోనై ఇలాంటి నిర్ణయాలు తీసుకుని కుటుంబాలకు మీ భవిష్యత్తుకు తీరని అన్యాయం చేయొద్దని సూచించారు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఏ కళాశాలలో నైనా విద్యార్థులకు యజమాన్య0 వేధింపులుగాని ఏవైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా విద్యార్థులకు తెలిపారు, కళాశాలలో బోధన విధానంలో హాస్టల్ వసతులలో క్యాంటిన్లలో ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని ఎల్లప్పుడు విద్యార్థులకు ఒక విద్యావంతునిగా నా సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలిపారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కమలాకర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.