రైల్వే పట్టాలను దాటుతున్న వారికి అవగాహన ఆర్పిఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కె ప్రసన్నకు

Published: Wednesday April 05, 2023

మధిర ,ఏప్రిల్ 4 ప్రజాపాలన ప్రతినిధి: రైల్వే పట్టాలను దాటుతున్న సందర్భంలో అనేక ప్రమాదాలకు ప్రయాణికులు గురి అవ్వడం వల్ల వికలాంగులుగాను, ప్రాణాలు కోల్పోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. వీటిపై ప్రయాణికులు అవగాహన కలిగి ఉండాలని కాలి వంతెన , ఆర్ఓబి దగ్గర మాత్రమే రైల్వే పట్టాలను దాటవలసిందిగా సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కె ప్రసన్నకుమార్ మధిర రైల్వే స్టేషన్ , రైల్వే గేట్ ప్రాంతాల్లో రైల్వే పట్టాల దాటుతున్న వారికి అవగాహన కలిగించారు. ఇటీవల ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ లో పట్టాలు దాటుతూ ప్రమాదంలో ఒకరు వృద్ధుడు చేయిని కోల్పోవడం జరిగిందని ఇటువంటి ప్రమాదాలను నివారించేందుకు భాగంగా సిఆర్పి ఆధ్వర్యంలో అవగాహన మధిర రైల్వే స్టేషన్ ప్రయాణికులకు కలిగించారు. ప్రతి ఒక్కరు అవగాహనతో బ్రిడ్జిను ఉపయోగించి మాత్రమే పట్టాలను దాటాలి అని రైల్వే హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా ప్రజలను కోరారు.