వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిసిన కౌన్సిలర్ అనంతరెడ్డి

Published: Friday April 14, 2023

* వికారాబాద్ బ్యూరో 13 ఏప్రిల్ ప్రజా పాలన : వికారాబాద్ నియోజకవర్గానికి విచ్చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు ఘన స్వాగతం పలికామని 15వ వార్డ్ కౌన్సిలర్ చిట్యాల అనంతరెడ్డి అన్నారు. గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 15వ వార్డు కౌన్సిలర్ చిట్యాల అనంతరెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 15వ వార్డు కౌన్సిలర్ మాట్లాడుతూ వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కృషి ఆనిర్వచనీయమని కొనియాడారు. ఉన్నత విద్యావంతుడైన ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధికి పక్కా కార్యాచరణను రూపొందించుకొని అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాడని పేర్కొన్నారు. అభివృద్ధి పథకంలో భాగంగా ఆయుష్ ఆసుపత్రిని ప్రారంభించారు. మెడికల్ కాలేజీ నిర్మాణం పనులను మంత్రులు పరిశీలించారని వివరించారు.