పలు గ్రామాల్లోపంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

Published: Wednesday November 02, 2022
మధిర నవంబర్ 1 (ప్రజా పాలన ప్రతినిధి) మండలంలోని మల్లారం, జాలిముడి, సిరిపురం గ్రామాలలోని మిరప మరియు వరి పంటలను మంగళవారం వైరా కె వి కె శాస్త్రవేత్తలు డాక్టర్ హేమంత్ కుమార్, డాక్టర్ రవికుమార్  పరిశీలించి రైతులకు తగు సూచనలు చేశారు. ప్రస్తుత కాలంలో మిరప పంటకు ఎండు తెగులు వచ్చే అవకాశం ఉన్నదన్నారు అందువల్ల రైతులు
ఎండు తెగులు నివారణకు కాపర్ ఆక్సి క్లోరైడ్ 3 గ్రాములు (లేదా) కాపర్ హైడ్రాక్సైడ్ 2.5 గ్రాములు (లేదా) కార్బన్డిజం 1గ్రాము లీటర్ నీటికి కలిపి తెగులు ఆశించిన మొక్కలకు మరియు చుట్టూ ఉన్న మొక్కల మొదళ్లలో పోయాలన్నారు. అదేవిధంగా 
కోమ్మ కుళ్ళు తెగులు నివారణకు కాపర్ ఆక్సి క్లోరైడ్ 30 గ్రాములు మరియు  స్టెప్టో సైక్లిన్  ఒక గ్రాము పది లీటర్ల నీటికి(లేదా) పైరాక్సోస్ట్రోబిన్ మరియు మెటీరాం  మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు. బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు నివారణకు కాపర్ ఆక్సి క్లోరైడ్ 30 గ్రాములు మరియు  స్టెప్టో సైక్లిన్ ఒక గ్రాము పది లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలన్నారు. కొత్త రకం నల్ల తామర పురుగులు నివారణకు ఒక ఎకరానికి నీలిరంగు జిగురు అట్టలు 20 నుండి 30 వరకు పెట్టాలన్నారు. అదేవిధంగా వరిలో సుడిదోమ నివారణకు బుఫ్రోఫెన్ జిన్ 1. 6 గ్రాములు  (లేదా) డైనోటెఫ్యురాన్ 0.4 గ్రాములు (లేదా) పైమెట్రోజైన్ 0.6 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు. ఆకు చుట్టు పురుగు నివారణకు కార్టాప్ హైడ్రో క్లోరైడ్  2 గ్రాములు (లేదా) క్లోరాన్ ట్రనిలిప్రోల్ 0.3 మిల్లీ గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మల్లారం, జాలిముడి, సిరిపురం సర్పంచులు మందడపు ఉపేంద్రరావు, తడికమల్ల ప్రభాకర రావు, కనకపుడి బుచ్చయ్య మధిర వ్యవసాయ అధికారి శ్రీనివాస రావు ఏఈఓలు వంశీకృష్ణ, కమల్ హాసన్, రైతుబంధు గ్రామ కోఆర్డినేటర్లు బొగ్గుల కృష్ణారెడ్డి, వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గుర్రాల సైదిరెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు.