ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 1ప్రజాపాలన ప్రతినిధి దోపిడీ లేని సమాజం కోసం అల్ ఇండియా ట్రేడ్ యూ

Published: Wednesday November 02, 2022

ఇబ్రహీంపట్నం ఏఐటీయూసీ 3 వ మండల మహాసభకు ముఖ్య అతిధి గా హాజరైనారు.  ఏఐటీయూసీ ఆవిర్బవించి 102 సంవత్సరాలు పూర్తి చేసుకొని 103 ఆవిర్బవ దినోత్సవాని పురస్కరించుకొని ఏఐటీయూసీ జెండా ఆవిష్కరణ చేశారు..
అనంతరం ఓరుగంటి యాదయ్యా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని అన్నారు.. కార్మికులు ఐక్య పోరాటాల ద్వారానే కార్మికుల సమస్యలు పరిష్కరించబడుతాయని అన్నారు.. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను లేబర్ కోడ్ లు గా మార్చడం ద్వారా యాజమాన్యల దోపిడీ తీవ్రమైందని అన్నారు. కార్మిక హక్కుల కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతుందని అన్నారు.. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కావలి నర్సింహా మాట్లాడుతూ కార్మిక హక్కుల కోసం కార్మికులను ఐక్యం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పూల యాదయ్య, చంద్రకళ, శివరాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఏఐటీయూసీ నూతన మండల కమిటీ ఎన్నుకున్నారు గౌరవ అధ్యక్షులు గా ఎండి అల్లి్మదీన్
అధ్యక్షులుగా పంది శ్యామేలు, ఉపాధ్యక్షులుగా శివరాల అశోక్, ఎల్. అనంతరెడ్డి ప్రధాన కార్యదర్శి ch. విజయ్ కుమార్ సహాయ కార్యదర్శులు గా కృష్ణమూర్తి షేకరా లతో పాటు 13 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.