ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి డివైఎఫ్ఐ రౌండ్ టేబుల్ సమావేశం

Published: Saturday July 02, 2022

ఆసిఫాబాద్ జిల్లా జూలై01ప్రజాపాలన, ప్రతినిధి) : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కై కార్పొరేట్, ప్రైవేట్, స్కూల్లో అధిక ఫీజుల దోపిడీ నియంత్రణ కై కృషిచేయాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక టిఏజిఎస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం  రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బోర్కుటే శ్యామ్ రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ  జిల్లా కార్యదర్శి గోడిసెల కార్తీక్ మాట్లాడుతూ కార్పోరేట్ ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, పాఠ్యపుస్తకాలు, దుస్తుల, పేరుతో అడ్డూ అదుపు లేకుండా దోపిడే దేయం గా డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. కానీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. విద్యా హక్కు చట్టం కింద ప్రతి సంవత్సరం కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల్లో 25శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బిసి, పిల్లలకు ఉచిత విద్య అందించాలని, జిల్లా వ్యాప్తంగా ఎంత మంది విద్యార్థులకు  అందిస్తున్నారని, విద్యాశాఖ అధికారులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే కార్పొరేట్ స్కూల్లో దోపిడి నియంత్రణ కై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, లేనియెడల ఉమ్మడి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు టికానంద్, ఏఐఆర్ఎస్ఓ, డిబివిఎస్, విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు.