అంగన్వాడీ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలి : ఎంపీపీ కోల జమున

Published: Thursday September 16, 2021
సారంగాపూర్, సెప్టెంబర్ 15 (ప్రజాపాలన ప్రతినిధి) : సారంగాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కారేక్రమానికి ముఖ్య అతిధిగా ఎంపీపీ కోల జమునశ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ ప్రతి మహిళ ఆరోగ్యాంగా ఉంటే పిల్లలు కూడ ఆరోగ్యాంగా ఉంటారని ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంగన్వాడీ సెంటర్లో అందించే పౌష్టికాహారాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డిడబ్ల్యుఓ అధికారి డా:నరేష్ మాట్లాడుతు ప్రతి ఇంట్లో పోషకాహారాన్ని ఇచ్చే కూరగాయల చేట్లను పండ్ల చెట్లను కాలానికి అనుగుణంగా దొరికెవి పెంచాలని అన్నారు. అంగన్వాడీ సెంటర్లో అందించే సేవలను వినియోగించుకోవలని అన్నారు. సిడిపిఓ సంపద కుమారి  మాట్లాడుతూ అందరూ పోషణతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. అనంతరం గర్భవతులకు శ్రీమంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పుల్లయ్య సుపర్వైజర్ ఆదిలక్ష్మి సర్పంచ్ గుర్రాల రాజేందర్ రెడ్డి అరుణశ్రీ పోషణ అభియాన్ కో-ఆర్డినటర్ ప్రణీత మరియు అంగన్వాడీ టీచర్స్ హెల్పేర్స్ తదితరులు పాల్గొన్నారు.