ప్రాథమిక ప్రభుత్వ అరోగ్య కేంద్రంలో వన మహోత్సవం

Published: Monday August 22, 2022
జన్నారం, ఆగస్టు 21, ప్రజాపాలన:  ప్రాథమిక  ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మండల వైద్యాధికారి ప్రసాద్ రావు అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం వైద్య శాఖలో 75 వ స్వర్ణోత్సవ స్వాతంత్ర దినోత్సవ వాస్తవ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తుందని జడ్పి స్ఇవో నరేందర్ అన్నారు. ఈ సందర్భంగా భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా ఆదివారం రోజు నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో జడ్పి సిఇవో నరేందర్  ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మాస్ ప్లాంటేషన్, ఆవరణలలో మొక్కలు నాటారు. మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాటి వన మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుందని అన్నారు. ఈ మొక్కలు నాటడం అనేది నిరంతర ప్రక్రియాని, తెలంగాణను హరిత తెలంగాణగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని, హరిత తెలంగాణ లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివై సిఇవో లక్ష్మీ నారాయణ, మండల ఎంపిడివో అరుణరాణి, వైద్య సిబ్బంది, జన్నారం గ్రామ పంచాయతీ సర్పంచ్ బూసానవేణి గంగాధర్ గౌడ్, గ్రామ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.