రాజీ పేరిట పిలిచి బెదిరిస్తున్నారు: కృష్ణ కిషోర్

Published: Friday November 26, 2021
హైదరాబాద్(ప్రజాపాలన ప్రతినిధి) : రాజీకి పిలిచి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కృష్ణ కిషోర్ అనే వ్యక్తి ఒక ప్రైవేట్ సంస్థ పై ఆరోపణలు చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొరియా దేశానికి తెలంగాణ తరపున గౌరవ కౌన్సిల్ గా వ్యవహరిస్తున్న చుక్కపల్లి సురేష్ గతంలో సదరు ప్రైవేట్ సంస్థకు చైర్మన్ గా వ్యవహారించాడని, ప్రస్తుతం సదరు ప్రైవేట్ సంస్థకు సురేష్ చుక్కపల్లి కుమారుడైన అవినాష్ చుక్కపల్లి చైర్మన్ గా వ్యవహరిస్తుండగా, చుక్కపల్లి సురేష్ హయాంలోనే హఫీజ్ పేట ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన సదరు ప్రైవేట్ సంస్థ  నూతన భవన నిర్మాణ ప్రక్రియ మొదలయ్యిందని, పక్కనే ఉన్న మాకు చెందిన 2,127 గజాల స్థలం పైభాగంలో పార్కు ఏర్పాటు చేసుకుని, భూగర్భంలో మూడు అంతస్థుల్లో పార్కింగ్ నిర్మించడం జరిగిందన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోకి వచ్చే ఫ్లైఓవర్ పక్కన కృష్ణ కిశోర్ వెలుమల, సుశేన్ కుమార్ నోములకు సర్వే నెంబర్ 83లో 917 గజాలు, నరేషకు సంబంధించి సర్వే నెంబర్ 77లో 1,210 గజాలు... మొత్తంగా 2,127 ఉన్నదని. సంబంధిత స్థలాన్ని 1983లో మా అమ్మమ్మ శాంతాబాయి కొనుగోలు చేయడం జరిగిందన్నారు. తదనంతరం కిశోర్, సుశేన్, నరేష్ కు సంబంధిత భూమి 2,127పై హక్కులు లభించాయని, సదరు ప్రైవేట్ సంస్థ సర్వేనెంబర్ 87, 88లకు చెందిన భూ హక్కుదారుల నుంచి దాదాపు మూడున్నర ఎకరాల భూమి నిర్మాణం కోసం 2016లో ఒప్పందం చేసుకున్నారని ఆయన తెలిపారు. దక్షిణ భాగంలో 231 అడుగుల రోడ్ ఫేసింగ్ మాత్రమే ఉండగా, జీహెచ్ఎంసీ అనుమతుల పత్రంలో 800 గజాల పైచిలుకుగా పేర్కొన్నారని ఆయన అన్నారు. నిర్మాణ సంస్థ పక్కనే ఉన్న మా భూమి మొత్తంగా ఆక్రమించి నిర్మాణం ప్రారంభించారని తెలిపారు. దీంతో తాము కోర్టును ఆశ్రయించామని. మూడు పర్యాయాలు స్టే ఆర్డర్ ఇచ్చినా. తదనంతరం కోర్టు జీహెచ్ఎంసీ కమిషనర్, సర్వే ల్యాండ్ రికార్డు డీడీని సర్వే నిర్వహించి నిజాలను తేల్చాలని సూచించారన్నారు. సర్వే అధికారులు ఆక్రమణదారుడికి మేలు చేసేలా ఆక్రమిత స్థలాన్ని పైన్ రోడ్డు కోసం స్వాధీనం చేసుకున్నట్లు తప్పుడు నివేదిక ఇచ్చారు. ఈ విషయం ప్రస్తుతం కోర్టులో కొనసాగుతున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తమ భూమి తమకు ఇప్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.