బీఆర్ఎస్ హయాంలోనే రామంతాపూర్ అభివృద్ధి

Published: Monday January 23, 2023
మాజీ కార్పొరేటర్ గంథం 
మేడిపల్లి, జనవరి 21 (ప్రజాపాలన ప్రతినిధి)  
బీఆర్ఎస్ పార్టీ హయంలోనే రామంతాపూర్ డివిజన్ అభివృద్ధి చెందిందని మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్న నాగేశ్వరావు పేర్కొన్నారు. శనివారం మాజీ కార్పొరేటర్ గంధం         జోత్స్ననాగేశ్వరావు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి
రామంతాపూర్ డివిజన్ నెహ్రూనగర్లో బీజేపీ కార్పొరేటర్ శంకుస్థాపన చేసిన శిలాఫలకాల వద్ద  వినూత్నంగా కొబ్బరికాయలు కొట్టి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్  గంథం జొత్స్నా నాగేశ్వరావు మాట్లాడుతూ బీజేపీ కార్పొరేటర్ ఎన్నికైన తరువాత శంకుస్థాపనలకే పరిమితమయ్యారని మండిపడ్డారు. డివిజన్లో రూ 57 లక్షల వ్యయంతో నిధులు మంజూరైన సీసీ రోడ్డు ఇంద్రనగర్ నగర్ డీ -మార్ట్ లైన్,అలాగే ఏడీఆర్ఎం హాస్పిటల్ నుంచి ఓల్డ్  రామంతపూర్ వరకు సీసీ రోడ్డు పనులు కొబ్బరికాయలు కొట్టి ప్రజలను మభ్యపెట్టడమే కానీ ఇంతవరకు పనులను ప్రారంభించలేదని అన్నారు.  డివిజన్లో పెండింగ్ పనులు చాలా ఉన్నాయని, ఆ పనులు పూర్తి అయ్యేంతవరకు నిరసన కార్యక్రమాలను చేస్తూనే ఉంటామని తెలిపారు. తమ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప బీజేపీ కార్పొరేటర్ చేసింది ఏమి లేదని అన్నారు. రామంతాపూర్ ప్రజలు 
బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారని, రానున్న రోజుల్లో బీజేపీ,కాంగ్రెస్ పార్టీల నుండి భారీ చేరికలు ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్  నాయకులు మధుసూదన్ రెడ్డి ,కొప్పు నర్సింగ్ రావు,శ్రీనివాస్ రెడ్డి,తుట్ నరసింహ,మనీష్,వెంపటి శ్రీను,ప్రశాంత్,ఆలేరమేష్,మహేందర్,
రాధా,లక్ష్మి ,మంజుల,శ్రీనివాస్,
 శ్రీనివాస్,చేగురి శ్రీను,మల్లేష్, కాలనీ వాసులు కృష్ణ ,ప్రదీప్ రాజ్ ,శ్రీకాంత్ ,చందు ,రాము ,కుమార్ పీజే,సేనాపతి తదితరులు పాల్గొన్నారు.