ఆదివాసీ, బంజారా భవనాల ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలి ఖమ్మం జిల్లా నాయకులు లక్ష్మణ్ నాయ

Published: Saturday September 17, 2022
పాలేరు సెప్టెంబర్ 16 ప్రజాపాలన ప్రతినిధి
రేపు బంజారాహిల్స్, హైదరాబాద్ నందు ఆదివాసీ, బంజారా ఆత్మగౌరవ భవనాలను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి చేతులమీదుగా ప్రారంభించుకోబోతున్న సందర్భంగా ఆదివాసీ, గిరిజనులు లక్షలాదిగా తరలిరావాలని తెలంగాణ ఉద్యమకారుడు, తెరాస జిల్లా సీనియర్ నాయకులు బాదావత్ లక్ష్మణ్ నాయక్ పిలుపునిచ్చారు. బంజారా భవన్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గిరిజనుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా అత్యంత విలువైన బంజారాహిల్స్ లో బంజారా, ఆదివాసి ఆత్మగౌరవ భవనాలను నిర్మించడం జరిగిందని తెలిపారు. గిరిజన ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా వారి అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని పునరుద్ఘాటించారు. గిరిజనుల పోడు భూముల సమస్య త్వరలోనే తీరుతుందని, గిరిజన రిజర్వేషన్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు అందిస్తారని  ఆకాంక్షించారు. బంజారా, ఆదివాసి ఆత్మగౌరవ భవనాలు నిర్మించి మనల్ని గౌరవించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రుణపడి ఉండాలని రేపు జరగబోయే సభను ప్రతి గొండు, కోయ గూడాల నుండి ప్రతి లంబాడి తండాల నుండి యావత్ తెలంగాణ గిరిజన జాతి కలిసివచ్చి విజయవంతం చేయాలని లక్ష్మణ్ నాయక్ పిలుపునిచ్చారు.