వృత్తిపట్ల వైద్యులు అంకితభావంతో పని చేయాలి : జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత

Published: Tuesday March 16, 2021
జగిత్యాల, మార్చి 15 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల ప్రభుత్వ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఇటివల పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన అనిరుద్ అనే రెండు నెలల బాబుకు కడుపులో పేగు జారుడు (అబ్ స్ట్రక్ టెడ్ హెర్నియా) శస్త్ర చికిత్స విజయవంతం చేయడంతో డా. గంగాధర్ రెడ్డి డా. కళ్యాణ్ అభినందిస్తు జగిత్యాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ వైద్యులను శాలులవతో ఘనంగా సన్మానించారు. రోగులపట్ల వైద్యులు వృత్తిరీత్యా అంకిత భావంతో పని చేస్తే దేవుని రూపంలో ఉన్న ప్రతిరూపాలని అప్పుడే రోగులు కోరుకుంటారని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా అరుదైన శస్త్ర చికిత్సలు చేపట్టుతున్న సమస్త వైద్యాధికారులను మరియు సిబ్బంది సేవలను కోనియాడారు. రాబోయే రోజులలో కూడ ఇలాంటి మెరుగైన సేవలను అందించి జగిత్యాల జిల్లా పేరును రాష్ట్రములో అగ్రగామిగా నిలబెట్టాలని జడ్పీ చైర్ పర్సన్ వసంత ఆకాంక్షించారు.