షాపింగ్ కాంప్లెక్స్ శంకుస్థాపన

Published: Sunday October 10, 2021
బోనకల్, ప్రజాపాలన ప్రతినిధి, అక్టోబర్ 9 : మండల కేంద్రంలో బోనకల్ గ్రామానికి సంబంధించిన సొసైటీ గోదాములు మరియు షాపింగ్ కాంప్లెక్స్ శంకుస్థాపన కార్యక్రమం కు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మరియు డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం పాల్గొని సొసైటీ షాపింగ్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేయడం జరిగింది. అనంతరం సొసైటీ గోడం సమీపంలోగల దుర్గామాతను దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తూర్ నాగేశ్వరరావు, బోనకల్ సహకార సంఘం అధ్యక్షులు చావా వెంకటేశ్వరరావు, బోనకల్ సర్పంచ్ భూక్యా సైదా నాయక్, ఎంపీటీసీ గుగులోతు రమేష్, మండల ఎంపిపి కంకణాల సౌభాగ్యం, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జునరావు, బోనకల్ గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షులు గుండపనేని సుధాకర్ రావు, మాజీ సర్పంచ్ పోటు వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పిటిసి భానోత్ కొండ, ఉప సర్పంచ్ యార్లగడ్డ రాఘవ, మాజీ సహకార సంఘం అధ్యక్షులు యార్లగడ్డ చిన్న నరసింహ మరియు మండలంలోని టిఆర్ఎస్ ముఖ్య నాయకులు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.