రివిలేషన్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు*

Published: Saturday September 24, 2022
మంచిర్యాల టౌన్, సెప్టెంబర్ 23,ప్రజాపాలన : రివిలేషన్ పాఠశాలలో ముందస్తుగా బతుకమ్మ పండుగ సంబరాలు  వైభవంగా నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులకు బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను తెలియజేయడానికి ముందస్తుగా పాఠశాలలో బతుకమ్మ పండుగ సంబరాలు ,తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేదే ఈ బతుకమ్మ పండుగ అని పాఠశాల కరస్పాండెంట్ రాపోలు విష్ణువర్ధన్ రావు అన్నారు.  
ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు  తల్లిదండ్రులు పాల్గొన్నారు.