మత్య సహకారసంఘం అధ్యక్షుడుగా నాగేశ్వరరావు* మధిర అక్టోబర్ 3 ప్రజా పాలన ప్రతినిధిమధిర మండలం వం

Published: Tuesday October 04, 2022

మధిర జులై 31 (ప్రభ న్యూస్) కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన గ్రీన్ ఫీల్డ్ హైవేకి కావలసిన భూసేకరణ మధిర నియోజకవర్గంలో ముందుకు సాగటం లేదు. ఇప్పటికే నియోజకవర్గంలో అనేకసార్లు అధికారులు భూసేకరణపై రైతుల నుండి అభిప్రాయాలను సేకరించారు. రైతుల నుండి సేకరించే భూములకు ప్రభుత్వం ఏ రకమైన పరిహారం ఇస్తుందో వివరంగా అధికారులు చెప్పకపోవడంతో రైతుల భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. రైతన్న నుండి భూములు బలవంతంగా లాక్కుంటున్నారంటూ ఇప్పటికే చింతకాని మండలం కుదువురికి చెందిన రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మం నుండి మధిర నియోజకవర్గం మీదుగా విజయవాడ వరకు నూతనంగా కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న  గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం రైతుల నుండి కావలసిన భూములను సేకరించేందుకు  ఖమ్మం ఆర్డిఓ రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో గతంలో రెండు సార్లు బాధిత రైతుల నుండి అభిప్రాయ సేకరణ చేశారు. ఖమ్మం నుండి విజయవాడ వరకు 90 కిలోమీటర్ల వరకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్ హైవేని మంజూరు చేసింది. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం 433 హెక్టార్ల భూమి అవసరం ఉంది. ఈ రహదారి వి వెంకటాయపాలెం నుండి మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం కొదుమూరు నేరడ నాగిలిగొండ బోనకల్ మండలం తూటికుంట్ల నుండి  వల్లాపురం, పెద్ద బీరవల్లి, బ్రాహ్మణపల్లి నుండి మధిర మండలం రొంపి మల్ల, సిరిపురం, ఆత్కూరు, మాటూరు, నిదానపురం, దెందుకూరు నుండి ఎర్రుపాలెం మండలం మీనవోలు, పెగళ్ళ పాడు, రేమిడి చర్ల మీదగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్తుంది. ఈ రహదారి ఖమ్మం జిల్లాలో 60 కిలో మీటర్లు ఉండగా కృష్ణా జిల్లాలో 30 కిలోమీటర్లు ఉంది. నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో ఈ రహదారి కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. రహదారి నిర్మాణం చేసే గ్రామాల్లో  రైతులకు చెందిన భూములు గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం రెవెన్యూ అధికారులు సేకరించాల్సి ఉంది. దీనిలో భాగంగా తొలి విడతలో వల్లాపురం, పెద్దబీరువల్లి, నిదానపురం, మీనవోలు బాధితుల రైతులతో అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం మరోసారి సిరిపురం గ్రామంలో రైతులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న పలువురు రైతులు మాట్లాడుతూ వ్యవసాయ భూములను ఎట్టిపరిస్థితిలో వదులుకునేది లేదన్నారు. కేవలం ఈ భూమిని నమ్ముకొని మాత్రమే వ్యవసాయం చేస్తూ కుటుంబాలను పోషించుకుంటు న్నట్లు రైతులు తెలిపారు. కుటుంబ జీవనాధారానికి ఆసరాగా ఉన్న భూములు కాస్త ప్రభుత్వం తీసుకుంటే తామెలా బతకాలంటూ పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులందరూ ఏకగ్రీవంగా భూములు ఇచ్చేది లేదంటూ ఆర్డీవోకి వినతి పత్రాలు అందజేశారు. మరి కొంతమంది రైతులు మాత్రం ఎకరానికి కోటి రూపాయలు పరిహారం ఇస్తే తమ పంట భూములు ఇస్తామని చెబుతున్నారు దీంతో రెండేళ్లుగా గ్రీన్ ఫీల్డ్ హైవే భూముల సేకరణ కార్యక్రమం మందకోడిగా కొనసాగుతుంది.