బీజేపీ దళిత మోర్చ అధ్వర్యంలో.. దళితులకు 5వేలు పెన్షన్ ఇవ్వాలని ఎం.అర్.ఓ కి వినతి

Published: Tuesday July 27, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లిలో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర విభాగం పిలుపు మేరకు సోమవారం ఉదయం శేరిలింగంపల్లి ఎమ్మార్వో కార్యాలయం వద్ద "డప్పు-చెప్పు" కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. అనంతరం డప్పు చప్పుళ్లతో దరువు వేసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. రాష్ట్ర దళిత మోర్చ అధికార ప్రతినిధి కాంచన కృష్ణ అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఈ పరిస్థితుల్లో దళిత డప్పు కళాకారులు, చెప్పులు కుట్టేవారు, కాటి కాపరులకు నెల నెలా రూ.5,000/- చొప్పున పెన్షన్ ఇవ్వాలని డిమాండ్‌ చేసారు ఎన్నికలప్పుడు మాత్రమే మన పాలకులకు 'దళిత బంధు'వులు గుర్తుకు వస్తారని విమర్శించారు. దళిత ముఖ్య మంత్రి ఎక్కడ అని, దళితులకు ఇస్తానన్న 3 ఎకరాల పొలం ఏది అని ప్రశ్నించారు. గత వారం వనపర్తి జిల్లాలోని గాంధీనగర్‌లో ఫీజులు కట్టలేక బీటెక్ విద్యార్థిని అయిన దళిత బిడ్డ లావణ్య ఆత్మహత్య వార్త విన్నామని, లక్షల్లో అప్పు చేసి మరీ అభివృద్ధి పనులు చేయించిన ఒక దళిత కౌన్సిలర్‌కు బిల్లులు రాక వేదన పడుతున్న వార్త నేటి మీడియాలో చూశామని, తెలంగాణలో దళితులకు జరుగుతున్న న్యాయం ఇదేనని, ఇక అల్పాదాయ వృత్తుల్లో ఉన్న దళిత కుటుంబాల పరిస్థితి మరింత దయనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ సమాజం భిన్న సంస్కృతుల సమాహారం, ఇందులో ప్రత్యేకించి దళిత సామాజిక వర్గం పాత్ర ఎంతో విశాలమైనది. ఈ సామాజికవర్గం లోని పలు కులాలవారు వివిధ వృత్తులను తరతరాలుగా అనుసరిస్తూ సమాజ మౌలిక అవసరాలను తీర్చడంలో ముందున్నారని, తెలంగాణలోని పరిస్థితులను గమనిస్తే, పోరాడి సాధించుకున్న మన ప్రత్యేక రాష్ట్రం లోని దళిత సామాజికవర్గాన్ని ఒక ఓటు బ్యాంక్‌గా మాత్రమే పాలకులు చూస్తున్నారు తప్ప దళితుల అభివృద్ధికి చేసింది శూన్యం అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాదక్ష్యులు, పోరెడ్డి బుచ్చి రెడ్డి, ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి గజ్జల యోగానంద్, సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి, రవి కుమార్ యాదవ్, సుర్ణ శ్రీశైలం, మహిపాల్ రెడ్డి, రాహుల్, కే. ఎళ్లేష్ ఎన్. చంద్ర మోహన్, అనిల్ గౌడ్, లక్ష్మణ్ ముదిరాజ్, రాధ కృష్ణ యాదవ్, హనుమంతు, భారత్ రాజ్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మహిళ నాయకులు పద్మ, భిమాని విజయ లక్ష్మి, బబ్లీ, అంజు మరియు శేరిలింగంపల్లి అసెంబ్లీ పరిధిలోని పలు డివిజన్‌ల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ, డివిజన్ బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో దళిత సోదరులైన డప్పు కళాకారులు, చెప్పులు కుట్టేవారు, కాటి కాపరులు పాల్గొన్నారు.