ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలి

Published: Wednesday October 13, 2021
మధిర, అక్టోబర్ 12, ప్రజాపాలన ప్రతినిధి : ఎస్ఎఫ్ఐ మధిర టౌన్ ముఖ్య కార్యకర్తల సమావేశం.. బోడేపూడి భవన్ లో జరిగింది ఈ సమావేశాల్లో SFI ఖమ్మం జిల్లా అధ్యక్షుడు వడ్రాణపు మధు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 25వ తేదీ నుండి గత సంవత్సరం ప్రభుత్వం ప్రమోట్ చేసిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్ష నిర్వహించాలని ఇంటర్ బోర్డు టైంటేబుల్ విడుదల చేసింది. ఈ పరీక్షల నిర్వహణ పై ఇంటర్ బోర్డు పునరాలోచించాలి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో గత 18 నెలలుగా కరోనా తీవ్ర రూపంలో విజృంభించింది. ఈ ఫలితంగా రాష్ట్రంలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. దీంతో విద్యార్థులు పరీక్షలు నిర్వహించడానికి అవకాశం లేకపోవడంతో 2019-2020 విద్యా సంవత్సరం విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేసింది. 2020-2021 విద్యా సంవత్సరం కూడా పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులను ప్రమోట్ చేశారు. కాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకొని కార్పొరేట్ కళాశాలల కోసం పరీక్షలు సిద్ధం చేస్తుంది. కానీ ఈ 18 నెలల కాలంలో ప్రభుత్వ కాలేజీల్లో 1700 గేస్ట్ లెక్చరర్ పోస్టులు రెన్యూవల్ చేయలేదు. దింతో ప్రభుత్వ కాలేజీల్లో ఆన్లైన్ లో కూడా తరగతులు జరగలేదు. లెక్చరర్ లేక పాఠాలు జరగక టీవీ పాఠాలు అర్థం కాక తీవ్ర ఇబ్బందులు విద్యార్థులు ఎదుర్కొన్నారు. కరోనా తీవ్రత తగ్గడంతో మళ్ళీ విద్యాసంస్థల ప్రారంభం అయ్యాయి. కానీ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్, గురుకులాలు ప్రారంభం కాలేదు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ నెలలో పరీక్షలు పెట్టాలని షెడ్యూల్ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీలు ప్రారంభం కాకపోయినా, హాస్టల్స్ తెరవక పోయినా పరీక్షల పెడతామని ఇంటర్ బోర్డు మొండిగా పోవడం అంటే దేనికి. మన జిల్లాలో కనీసం ఇంటర్నెట్ సౌకర్యం లేక ఆన్లైన్ చదువులే సాగని కాలంలో ఈ పరీక్షలు పెట్టి ఏం చేస్తారు. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు ప్రస్తుతం రెండవ సంవత్సరం చదువుకుంటూ, మొదటి సంవత్సరం పరీక్షలు రాయడం అంటే సాధ్యపడే అంశం కానేకాదు. విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోను చేసే అవకాశం ఎక్కువ కార్పొరేట్ కాలేజీలకు మాకే మొదటి ర్యాంకు మాకే అంటూ ప్రచారం ఆవిర్భావం చేసుకొని వారి వ్యాపార సామ్రాజ్యం పెంచుకోవడం తప్ప మరి దేనికీ పరీక్షలు ఉపయోగపడవు. ఎలాగో రెండవ సంవత్సరం పరీక్షలు విద్యార్థులు రాస్తారు. కాబట్టి మొదటి సంవత్సరం పరీక్షలను ప్రతి కళాశాలలో అసైన్మెంట్ రూపంలో నిర్వహించి, ఆ కళాశాల యాజమాన్యమే మార్కులు కలిపే విధంగా విద్యార్థులపై ఒత్తిడి లేకుండా ఇంటర్ బోర్డు చర్యలు తీసుకోవాలని లేని యెడల జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడిట్ కళాశాలలో విద్యార్థుల సమీకరించి ఆందోళన కార్యక్రమలు చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ముఖ్యనాయకులు పేరు స్వామి, ప్రశాంత్, గణేష్, మస్తాన్, అభిషేక్, రవి రాజు తదితరులు పాల్గొన్నారు