సారపాక సెయింట్ థెరీసా హైస్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన హై స్కూల్ మేనేజర్ సిహె

Published: Thursday December 22, 2022
డిసెంబర్ 21
బూర్గంపాడు మండల పరిధిలోని సారపాకలో గల సెయింట్ థెరిసా హైస్కూల్లో బుధవారం సెమీ క్రిస్టమస్ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సెయింట్ ధెరిసా హైస్కూల్ మేనేజర్ ఫాదర్ సిహెచ్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను జరిపారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఫాదర్ సిహెచ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ లోకరక్షకుడు క్రీస్తు యేసు చూపిన ప్రేమను పంచాలన్నారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే గుణాన్ని, ఇతరులను క్షమించే గుణాన్ని క్రీస్తు ద్వారా అలవర్చుకోవాలన్నారు. విశ్వ వ్యాప్తంగా డిసెంబరులో జరిగే క్రిస్మస్ వేడుకల ద్వారా క్రీస్తు సువార్తను ప్రకటించాలన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రత్యేక గీతాలను ఆలపించారు.
దేశాన్ని పరిపాలించే పాలకుల కోసం, రాష్ట్రాలను పరిపాలించే పాలకుల కోసం అధికారుల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ క్రమంలో హైస్కూల్ విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. పాఠశాల ప్రాంగణంలో క్రీస్తు జననానికి సంబంధించిన పశువుల పాక ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది. అదేవిధంగా క్రిస్మస్ తాత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా కేకును కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ అజయ్ కుమార్, సిస్టర్ సుమ, హైస్కూల్ హెడ్మాస్టర్ మహమ్మద్ సులేమాన్, ఉపాధ్యాయులు ప్రవీణ్ బాబు, ఇసంపల్లి నరహరి, నాగలక్ష్మి, రమాదేవి, సుభద్ర, సంధ్య, హన్నా మేరీ, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.