చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పట్టణ తెలుగు దేశం

Published: Thursday April 21, 2022
మధిర ఏప్రిల్ 20 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు బుధవారం నాడు, తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ వాసవి రామనాధం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు 72వ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయ సాధనకై కృషి చేస్తున్నా చంద్రబాబు నాయుడుని కొనియాడారు. దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని బాబుకి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో  టౌన్ పార్టీ అధ్యక్షులు మల్లాది హనుమంతరావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చేకూరి శేఖర్ బాబు,రాష్ట్ర మహిళా కార్యదర్శి మేడే పెళ్లి రాణి, రాష్ట్ర యువజన కార్యదర్శి మై నీడీ జగన్మోహన్ రావు, పగిడిపల్లి విజయమ్మ, రత్నకుమారి, మేడ వెంకటేశ్వరరావు, గడ్డం రమేష్, దేవభక్తిని వెంకటేష్ వెంకటేష్ గడ్డ మల్లికార్జునరావు, ఎలమంచిలి శివ, అనుమోలు సతీష్, వేల్పుల కొండా, రామ్మోహన్ రావు. తదితరులు పాల్గొన్నారు.