పట్టణ ప్రగతి భాగంలో డివిజన్ ని అభివృద్ధి చేసుకోవడానికి ఇదే సదవకాశం

Published: Saturday July 03, 2021
బాలాపూర్: (ప్రతినిధి) ప్రజాపాలన : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి, హరితహారం పలు డివిజన్ డెవలప్మెంట్ కు ప్రాముఖ్యతని స్థానిక కార్పొరేటర్ అక్కి మాధవి ఈశ్వర్ గౌడ్ తెలిపారు. మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 45వ డివిజన్ కార్పొరేటర్ అక్కి మాధవి ఈశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో మూడో విడత పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమం శుక్రవారం నాడు దిగ్విజయంగా కాలనీ వాసులతో కలిసి కార్పొరేటర్ నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ మాట్లాడుతూ..... రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి, హరితహారం మంచి కార్యక్రమని చెప్పవచ్చని అన్నారు. శానిటేషన్ పిచ్చి మొక్కలు తొలగించడం, రోడ్లపై పేరుకుపోయి ఉన్న మట్టిని తొలగించి, మంచినీటి సమస్య, విద్యుత్ సమస్య, దోమల నివారణకు చెట్లు నాటడం చాలా మంచిదని, ఎన్నో కార్యక్రమాలు తీసుకొని డివిజన్ని అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశమని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, జిహెచ్ఎంసి మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంచి అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తో పాటు స్థానిక కార్పొరేటర్ పాల్గొన్నారు.