దేశినేని పాలెంమిర్చి రైతులకు భరోసా.

Published: Wednesday November 17, 2021
మధిర నవంబర్ 16 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలంలోని దేశినేనిపాలెం, రాయపట్నం గ్రామాల్లో SERP గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్ద ఉన్నత అధికారులు సందర్శించడం జరిగింది. ఆయా గ్రామాల్లోని మిర్చి పండించే రైతులతో ముఖాముఖి చర్చించడం జరిగింది. వారు మిర్చి పండించే పద్దతులు, మార్కెటింగ్ సౌకర్యాలు, ధర, మొదలైన విషయాలపై చర్చించడం జరిగింది. ఈ విషయాలను అధిగమించడానికి రాబోయే రోజుల్లో మధిర మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ద్వారా మండలంలోని గ్రామాల్లో రైతుల నుండి మార్కెట్ ధరకు నేరుగా మిర్చి కొనుగోలు చేస్తామని తెలియజేశారు.  అనంతరం స్టానిక వెలుగు మండల సమాఖ్య కార్యాలయం నందు జరిగిన బోర్డ్ ఆప్ డైరెక్టర్స్ సమావేశంలో పాల్గొన్నారు. మహిళా కంపెనీ డైరెక్టర్స్ తో పుడ్ ప్రాసెసింగ్ కార్యక్రమంపై చర్చించారు. త్వరలో మధిర మండలం నందు మిర్చి ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ పుడ్ ప్రాసెసింగ్ డైరెక్టర్ శ్రీమతి సుష్మ, ఖమ్మం జిల్లా గ్రామీణాభివ్రుద్ది అధికారి శ్రీమతి విధ్యాచందన, SERP డైరెక్టర్ శ్రీమతి రజిత, DPM శ్రీనివాస్, ప్రభంజన్, APM రాంబాబు, దేశినేనిపాలెం సర్పంచ్, సిబ్బంది పాల్గొన్నారు.