ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 17ప్రజాపాలన ప్రతినిధి *రైతాంగ సమస్యలు పరిష్కరించాలి* *పోల్కంపల్లి గ

Published: Friday November 18, 2022
రంగారెడ్డి జిల్లా  రైతాంగ సమస్యలు పరిష్కరించాలనీ రైతు సంఘం ఇబ్రహింపట్నం మండల కార్యదర్శి చీమల ముసలయ్య అన్నారు. ఇబ్రహింపట్నం మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామంలో తెలంగాణా రైతు సంఘం  జెండా ఆవిష్కరణ జరిపి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సంద్భంగా ముసలయ్య మాట్లడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి ప్రభుత్వం రైతుల పై అధిక బరాలు మోపుతుందాని అన్నారు. దేశంలో మోటర్లకు మీటర్లు పెడుతున్నారని చెప్పారు దేశానికి వెన్నుముక అని చెప్పుకునే రైతుల ఎన్నుముక్కుకు విరగొట్టే పరిస్థితి చేస్తున్నారని ధ్వజమెత్తారు వడ్లను ఎలాంటి షరతులు లేకుండా కొనలని తెలిపారు. అనంతరం నుతన కమిటికి  అధ్యక్ష, కార్యదర్శులుగా కసరమౌని జంగయ్య, మాడుగుల కరుణాకర్ రెడ్డి,ఉపాధ్యక్షులు యాదయ్య సహయ కార్యదర్శి, కట్ట పాండు కమిటి సభ్యులుగా అమనగంటి బాలరాజు, పంది బలరాం, కె. శ్రీనివాస్,కే. ఐలయ్య తో కమిటీని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు చెరుకూరి నర్సింహ్మా, గూడెం అశోక్, పంది వెంకటేశ్, ఎ.నర్సింహ్మా,పి. స్టాలిన్,నాయకులు కే. వెంకటేశ్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు,