చిల్కానగర్ డివిజన్లో మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటన

Published: Tuesday April 27, 2021
మేడిపల్లి, ఏప్రిల్ 26, ప్రజాపాలన ప్రతినిధి : చిలుకానగర్ డివిజన్ పరిధిలో పలు సమస్యలపై  ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ తో కలిసి గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటించారు. డివిజన్ పరిధిలోని పలు సమస్యలను మరియు సానిటేషన్ డంపింగ్ పాయింట్లను పరిశీలించారు. బీరప్పగడ్డలోని హైటెన్షన్ వైర్లు ఇళ్ల పైనుంచి ఉండడంవల్ల చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నామని చాలా మంది చనిపోవడం జరిగింది అని స్థానిక కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ దృష్టికి తీసుకురావడంతో కార్పొరేటర్ మేయర్, ఎమ్మెల్యే పర్యటనలో భాగంగా బీరప్పగడ్డ ప్రాంతంలో స్థానికులతో కలిసి పర్యటించారు. త్వరలోనే హైటెన్షన్ వైర్లు తొలగించేందుకు కృషి చేస్తామని బీరప్పగడ్డ వాసులకు మేయర్, ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. విసాతత్ ఎంక్లేవ్ కల్వర్టు  క్రుంగిపోయిన విషయాన్ని కార్పొరేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి తెలియజేయడంతో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులకు మేయర్ వెంటనే ఎస్టిమేట్ ప్రిపేర్ చేసి త్వరగా కల్వర్టును పునర్నిర్మించాలని ఆదేశించారు. మల్లికార్జున్ నగర్ కాలనీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అవుట్లెట్ కనెక్షన్ లేక డ్రైనేజీలు పొంగుతున్నాయని. స్థానికులు ఇబ్బంది పడుతున్నారని కార్పొరేటర్ ప్రత్యక్షంగా మేయర్, ఎమ్మెల్యే ను స్పాట్ లోకి తీసుకువెళ్లి చూపించడం జరిగింది. మేయర్ అధికారులను వెంటనే అవుట్లెట్ కనెక్షన్ కోసం ప్లాన్ ప్రిపేర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. చిల్కానగర్ డివిజన్ కి ఆనుకొని ఉన్న చెత్త డంపింగ్ పాయింట్ని ఐలా అధికారులతో మాట్లాడి వెంటనే అక్కడి నుంచి తొలగిస్తామని మేయర్ మరియు ఎమ్మెల్యే చిల్కానగర్ వాసులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిల్కానగర్ డివిజన్ అధ్యక్షులు బన్నాల  ప్రవీణ్ ముదిరాజ్, పల్లె నర్సింగ్ రావు ఏదుల కొండల్ రెడ్డి, జగన్, వెంకటేష్, ఈరెల్లీ రవీందర్ రెడ్డి, పండ్ల కిషన్, ముద్దం శ్రీనివాస్, అబ్బో భాయ్, రామ్రెడ్డి, పర్మేష్, మాస శేఖర్, బింగీ శ్రీనివాస్, రవీందర్ గౌడ్,సుందర్ ఉపెండర్, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.