సామాజిక సేవలో ఎల్లవేళలా ఉచిత వైద్య సేవలందించిన దాత చల్మెడ సేవలు చిరస్మరణీయం గాంధీ చేతికాగి

Published: Thursday August 18, 2022
కరీంనగర్  ఆగస్టు 17 ప్రజాపాలన ప్రతినిధి :
 
కరీంనగర్ జిల్లాలో తన వంతు కృషిగా కరీంనగర్ జిల్లా ప్రజల ఆరోగ్య
పరిరక్షణ కోసం చల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాలను ప్రారంభించి ఎందరో పేదలకు వైద్య సేవలు అందిస్తున్న చల్మెడ మెడికల్ కళాశాల అధినేత లక్మినరసింహారావు సేవలు మరువ లేనివని గాంధీ చేతికాగితపు పరిశ్రమ అధినేత జోగినపల్లి రఘునందన్ రావు కొనియాడారు.‌చల్మెడ మెడికల్ కళాశాల అధినేత చల్మెడ లక్మినరసింహారావు శ్రీమతి సునీల దంపతుల‌ వివహా‌వేడుకల్లో పాల్గోని రఘునందన్ పుష్పగుచ్చం అంజేసి  శుభాకాంక్షలు తెలియజేశారు.
 ఈ సందర్బంగా రఘు మాట్లాడుతూ ఇంట్లో ఇల్లాలు బాగుంటేనే ఆ ఇల్లు బాగుంటుందనే ఉద్దేశంతో ఎంతోమంది తల్లులు క్యాన్సర్ బారిన పడి ఇబ్బందులు పడుతున్న సమయంలో తన ఆసుపత్రలో ఉచిత వైద్య సేవలంది  ప్రాణాలను కాపాడిన ఘనత లక్మినరసింహారావు దక్కించుకున్నారన్నారు. క్యాన్సర్ వ్యాది సోకిన మహిళను  మెుదటి   దశలోనే  పరిక్షలు నిర్వహించి కను గొన్నట్టయితే ఆ తల్లిని  ప్రణాపాయం నుండి రక్షించుకోవచ్చనే అనే ఉద్దేశ్యంతో వందలాదిగా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాలు ఏర్పాటు వ్యాది నిర్దారాణ పరిక్షలు నిర్వహించారన్నారు.కరీంనగర్ జిల్లా దాదాపు 32 వేలకు పైగా ఆడబిడ్డలకు పూర్తి స్థాయిలో ఉచితంగా స్క్రీనింగ్ టెస్ట్ లు నిర్వహించడం ఎంతో అభినంద నీయమన్నారు.దాంతో పాటు రొగులకు ఉచిత మందుల పంపిణీ  చేసి వారి పాలిట చల్మెడ లక్ష్మీ నరసింహారావు ప్రాణదాతగా నిలిచాడన్నారు.
 
 అంతే కాకుండా జిల్లాలోని పేద ప్రజలు కంటి చూపు కు సంబంధించిన ఇబ్బందులతో బాధపడుతున్నారిని చేరదీసి దాదాపు 18 వేల మందికిపైగా ఉచిత మోతె బిందు క్యాటరాక్ట్ ఆపరేషన్ నిర్వహించారన్నారు.ఇంకా అనేక మంది పేద వారి పాలిట నేత్ర నయనానందమయ్యారన్నారు.
అలాగే జిల్లాలో డెంగ్యూ వ్యాధిన బారిన పడిన  ప్రజలు హైదరాబాదులోని ఖరీదైన  హాస్పిటల్ లకు వెళ్లి రూపాయలు 80 వేల నుండి లక్ష వరకు ఖర్చు చేయలేరనే ఉద్దేశంతో,దాంతో పాటు పేషెంట్ తో పాటు వెళ్లిన బంధువులు సూపర్ స్పేషాల్టీ ఆసుపత్రుల కారిడార్లలో అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలుకున్న ఆయన ఏకంగా
 తన మెజికల్ కళాశాలలో కరోనా పరిక్షల పరికరాలతో పాటు తీసుకొచ్చి కేవలం13 వేల రూపాయలకే  వైద్యం అందించి లక్మినరసింహారావు ప్రాణ దాతగా ‌నిలిచారని రఘనందన్ కొనియాడారు.
 ఇటీవల విజృంబించిన కోవిడ్ 19 తో అనేక మంది విలవిలలాడే తరుణంలో నేనున్నానంటూ ముందుకొచ్చి కరీంనగర్ జిల్లాలోనే మొట్టమొదటి కోవిడ్  సెంటర్ ను ప్రారంభించి ఆసుపత్రిలో
250 బెడ్స్ ను  ప్రారంభించి అత్యవసర సేవలందించారన్నారు.అంతే కాదు బడుగు బలహీణ వర్గాల ప్రజలకు ఉచిత సేవలందించే అందుకు వేల మందికి ఉచిత వైద్యసేవా కార్డులను
 పంపిణి చేసి‌  లక్మినరసిహరావు  దన్వంతరి వారసుడిగా నిలిచారని రఘునందన్ రావు కొనియాడారు.