జిమ్ములను ఉపయోగించుకొని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత

Published: Friday December 02, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 1 ప్రజాపాలన ప్రతినిధి:
జిమ్ములను ఉపయోగించుకొని పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా అన్నారు.
బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ స్టేడియంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఓపెన్ జిమ్ ను, చైర్ పర్సన్ జక్కుల శ్వేత గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి వాకింగ్ చేస్తూ, ఓపెన్ జిమ్ములో వ్యాయామాలు చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని, పట్టణంలోని వివిధ వార్డుల్లో ఏర్పాటుచేసిన పార్కుల్లోనూ, క్రీడా ప్రాంగణాల్లోనూ ఓపెన్ జీమ్ లను ఏర్పాటు చేస్తున్నామనీ, అందులో భాగంగానే తిలక్ స్టేడియంలోనూ, నంబర్ టు గ్రౌండ్ లోను ఏర్పాటు చేశామని, కొద్ది రోజుల్లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్కుల్లోనూ, ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేసి ప్రారంభిస్తామని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, వార్డు కౌన్సిలర్ ఎలిగేటి సుజాత, బొడ్డు నారాయణ, గెల్లి రాజలింగు, సూరం సంగీత, కెమిశెట్టి సరిత, షేక్ ఆస్మా, షేక్ అప్సర్, దామెర శ్రీనివాస్, గడ్డం అశోక్ గౌడ్, తెరాస నాయకులు నెల కంటి శ్రీధర్, పోలు శ్రీనివాస్, సూరం బానేష్, ఎలిగేటి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.