రూ. 8434925 విలువగల ఉపాధి హామీ పనుల క్షేత్రస్థాయిలో పరిశీలన

Published: Thursday September 23, 2021
వెల్గటూర్, సెప్టెంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి) : 13వ విడత సామాజిక తనిఖీల్లో భాగంగా వెల్గటూర్ మండలం ముత్తునూర్ గ్రామంలో సామాజిక తనిఖీ గ్రామ సభ ముత్తునూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ అనుమాల తిరుపతి అధ్యక్షతన బుధవారం రోజున నిర్వహించారు. జిల్లా రిసోర్స్ పర్సన్ ఎ.సతీష్ ఆధ్వర్యంలో విలేజ్ రిసోర్స్ పర్సన్ రవిత, అర్చన, అనూష ఆధ్వర్యంలో 01-04-2919 నుండి 31-07-2021 వరకు మొత్తం 96 పనులు మొత్తం  ముత్తునూర్ గ్రామములో జరిగినట్లు ఈ పనులకు గాను 7013572 రూపాయలు అదేవిధంగా మెటీరియల్ రూపకంగా 1421353 రూపాయల పనులు జరిగాయని అలాగే మొత్తం 8434925 ఖర్చు చేయడం జరిగిందని ఇట్టి పనులకు గాను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తనిఖీ బృందం ఎలాంటి అవకతవకలు లేవని గ్రామ సభలో కూలీల అందరికీ సకాలంలో వేతనాలు అందినట్లు గ్రామ సభలో ఆయన పేర్కొన్నారు. ఉప సర్పంచ్ గొల్ల మల్లమ్మ పాలకవర్గ సభ్యులు, ఉపాధి హామీ కూలీలు, మహిళా సంఘ సభ్యులు గ్రామస్తులు యువకులు వృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి అజిత్ కుమార్, సంఘ వెంకటేష్ గొల్ల తిరుపతి, శ్రీరాంపురం అమృత తదితరులు పాల్గొన్నారు.