ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం పిజియోథెరపీ శిబిరం

Published: Friday September 24, 2021
మల్లాపూర్, సెప్టెంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి) : మల్లాపూర్ మండల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ప్రత్యేక అవసరాలు (శారీరకంగా వైకల్యం) గల 18 సంవత్సరాలలోపు పిల్లల కోసం ప్రతి బుధవారం ఫిజియో థెరపీ చికిత్స శిబిరాన్ని గురువారం ప్రారంభించారు. మండల కేంద్రంలోని భవిత కేంద్రం వైద్యులు డాక్టర్ ఇ.శివకుమార్ చికిత్స అందజేస్తారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల ప్రత్యేక ఉపాధ్యాయుడు బి.మల్లేశం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల టీచర్స్ ఏ.అనిత, వి.మంజుల, బి.రాజేందర్, ఎస్.కె మలాన్, టి.ప్రేమ్, బి.గంగాధర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.అనిల్, చిన్నారులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.