పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రోడ్లు, డ్రైనేజీ శుభ్రం చేసిన మున్సిపల్ సిబ్బంది

Published: Monday June 06, 2022

కోరుట్ల, జూన్ 05 (ప్రజాపాలన ప్రతినిధి):
4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమం లో భాగంగా ఆదివారం రోజున కోరుట్ల పట్టణం లో 3వ వార్డ్ మరియు 27 వ వార్డ్ లలో  పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించారు. కోరుట్ల పట్టణంలోని మాదాపూర్ కాలనీ, కటికే వాడ, శ్రీనివాస రోడ్, వినోబా రోడ్ లలో రోడ్లు,డ్రైనేజీ లను శుభ్రం తో పాటుగా ఇతర సమస్యలను పరిష్కరించారని మున్సిపల్ అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య , కమిషనర్ అయాజ్ , 3వ వార్డ్ కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మినారాయణ , 27వ వార్డ్ కౌన్సిలర్ గుండోజి శ్రీనివాస్ , వార్డ్ స్పెషల్ ఆఫీసర్స్ ప్రవీణ్ హెల్త్ అసిస్టెంట్, శ్రీకాంత్ జూనియర్ అసిస్టెంట్, ఏసిపి  శ్రీనివాస్ రావు, మేనేజర్ శ్రీనివాస్, మెప్మా సిబ్బంది, వార్డ్ ప్రజలు మరియు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు