ప్రతి వాహనమునకు అన్ని రకాల ధ్రువపత్రాలు కలిగి ఉండాలి. కోరుట్ల మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ రం

Published: Tuesday November 08, 2022

కోరుట్ల, నవంబర్ 07 (ప్రజాపాలన ప్రతినిధి):
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, తేదీ:
11-11-2022 నుండి మండల వారిగా వాహన తనిఖీ వుంటుందని రవాణా శాఖ కోరుట్ల పరిధిలో గల  కోరుట్ల, మేడిపల్లి, కథలాపూర్, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండల మరియు గ్రామాల వాహన యజమానులకు సకాలంలో వాహన పత్రాలు చేసుకోవాలని కోరుట్ల ఆర్టీవో రంజిత్ సూచించారు.ప్రతి రవాణా వాహన వాహనాలను ఫిట్నెస్, పర్మిట్, రిజిస్ట్రేషన్, పొల్యూషన్, టాక్స్ మరియు వాహన డ్రైవర్ కు తగిన అర్హతలు గల లైసెన్సు కలిగి ఉండాలని కోరారు.ప్రతి వాహనమునకు వాహనమ నెంబర్ ప్లేట్లు నాలుగు ప్రక్కల కలిగి ఉండలని, పరిమితి కి మించి ప్యాసింజర్లను తీసుకెళ్లరాదు.  సీటింగ్ కెపాసిటీకి మించి ప్యాసింజర్లు కూడా ప్రయాణించవద్దు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే గాయపడ్డ ప్రయాణికులకు కానీ,
మరణించిన వారికి కానీ,ప్రమాదంలో చెడిపోయిన వాహనాల కు గాని నష్టపరిహారము, వాహన ఇన్సూరెన్స్  వర్తించదని తెలిపారు.రవాణ వాహనాలు పరిమితికి మించి సరుకు రవాణా చేయడం వల్ల ఇట్టి వాహనము మరియు రోడ్లు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంలో ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణం నష్టం ఆస్తి (వాహనం) నష్టం జరిగితే ఎలాంటి ఇన్సూరెన్సులు వర్తిందని తెలిపారు. తన యజమానులు తమ వాహనము లైసెన్స్ లేని వారికి ఎట్టి పరిస్థితులలో ఇవ్వవద్దు.ప్రతి వాహనమునకు అన్ని రకాల ధ్రువపత్రాలు కలిగి ఉండవలెను.లైసెన్స్ లేని వ్యక్తి ఏదైనా ప్రమాదం చేసిన, వారికి ప్రమాదం జరిగిన, మద్యం తాగి ఉన్న జరిగిన సంఘటనకు సంఘటనకు వాహన యజమానులు చట్టరీత్య తగిన బాధ్యులు.18 సంవత్సరాలు నిండని యువతీ యువకులకు వాహనము ఎట్టి పరిస్థితుల్లో, సరదాకి కూడా వాహనం ఇవ్వరాదు. దీనివల్ల ఏ సంఘటన జరిగినా యజమాని పూర్తి బాధ్యత గమనించగలరు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించవలెను. కారు నడిపేవారు  తోటి ప్రయాణికులు సీట్ బెల్ట్ ధరించవలెను. దీనివల్ల అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినా చిన్న గాయాలతో తక్కువ ఖర్చుతో బయటపడే అవకాశం ఉంది.
ఇక ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-2022 నుండి అక్టోబర్-2022 వరకు, గత 7 నెలలో ఇప్పటివరకు 300 వాహనాలు పైగా తదితర కారణాల వల్ల కేసులు  చేయబడ్డాయి. ఇప్పటివరకు టాక్స్ 21,18,700/-,పెనాల్టీ- 18,36,270/-
కంఫౌండ్ ఫీ 8,69,730/-
మెత్తం: 48,24,680/- వరకు  జరిమానా రూపంలో కోరుట్ల రవాణా శాఖకు వచ్చిన ఆదాయం వచ్చిందని తెలిపారు. మీ వాహనము తనిఖీల పట్టుబడినప్పుడు ప్రభుత్వానికి కట్టే జరిమానా గాని అపరాధ రుసుము చెల్లింపుల కంటే, అదే డబ్బుతో ఫీజులు కట్టేసి కాగితాలు చేసుకోగలరని ప్రజలకు  కోరుట్ల ఆర్టీవో రంజిత్ సూచనలు చేశారు.