గ్రామాల్లో అభివృద్ధి పనులను పర్యవేక్షణ చేసిన ఎంపీడీఓ...

Published: Tuesday June 22, 2021
సారంగాపూర్, జూన్ 21 (ప్రజాపాలన ప్రతినిధి) : సారంగాపూర్ మండలం పోతారం గణేష్ పల్లె కోనపూర్ లచ్చక్కపేట తదితర గ్రామాల్లో సారంగాపూర్ ఎంపీడీఓ జె. పుల్లయ్య పర్యవేక్షణ చేసి అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామాల్లో పల్లెప్రగతి పనులపై ఆరాతీసి గ్రామాల్లో శానిటేషన్ రోడ్ల పరిశుభ్రత వర్షాలకు గుంతలు పడి చెడిపోయిన రోడ్లను పరిశీలించి వీలైనంత త్వరగా చెడిపోయిన గుంతల్లో మట్టినింపాలని కార్యదర్శులకు సర్పంచులను ఆదేశించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి గ్రామాల్లో సమస్యలు లేకుండ చూడాలని కోరారు