కాలేశ్వరం ప్రాజెక్టు పేరు మీద కెసిఆర్ కుటుంబం దండిగా దోచుకుంది -- సింగిరెడ్డి హరివర్ధన్

Published: Friday September 30, 2022

చౌటుప్పల్, సెప్టెంబర్ 29 (ప్రజాపాలన ప్రతినిధి): ఒక్క వరదకే కాలేశ్వరం ప్రాజెక్టు లో ఉన్న బాహుబలి మోటర్లు బురదలో కూరుకుపోయాయంటే ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ కుటుంబం ఎంత దోచుకుందో అర్థమవుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దేవలమ్మ నాగారం, ధర్మోజి గూడెం,ఖైతపురం, కాట్రేవు, గ్రామాల కాంగ్రెస్ పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం గ్రామంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణ తెలంగాణపై కేసీఆర్ వివక్ష చూపుతున్నారని అక్కరరాణి కాలేశ్వరం ప్రాజెక్టుకు కోట్ల రూపాయలు పెట్టిన కేసీఆర్ రైతులకు సాగునీరు అందించే మునుగోడు నియోజకవర్గంలోని శివన్న గూడెం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. బై ఎలక్షన్ వస్తేనే కెసిఆర్ ఫామ్ హౌస్ వీడుతారని ఎద్దేవా చేశారు. చౌటుప్పల్ మండలం పూర్తిగా కాలుష్య కోరల్లో చిక్కుకొని ఒకపక్క రైతాంగం మరోపక్క ప్రజలు అనేక బాధలు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు లేరంటకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. మునుగోడులో టిఆర్ఎస్ బిజెపి పార్టీలు డబ్బులతో రాజకీయం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తు పేద మధ్య తరగతి కుటుంబాలను బ్రతకనీయకుండా చేస్తుంటే. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్, రేట్లు పెంచి ములిగే నక్కపై తాటి పండు పడేలా చేస్తున్నారని మండిపడ్డారు.మును గోడు ఉప ఎన్నికల్లో ప్రజలు కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే మునుగోడు ఆడపడుచు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జక్క యాదిరెడ్డి, మాజీ ఎంపీటీసీ మల్కాపురం నరసింహ, మాజీ ఉపసర్పంచ్ బొమ్మ మైసయ్య, వార్డు సభ్యులు బొమ్మ లింగస్వామి, నాయకులు పన్నాల రాజిరెడ్డి, రాసాల జంగయ్య, పిన్నిటి జంగారెడ్డి, కానుగు యాదయ్య, పెంబల లింగస్వామి, పులిగిల్ల రాము, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.