విద్యార్థులు ఒత్తిడి లేని విద్యను అభ్యసించాలి కేంద్ర సహాయక మంత్రి బి.ఎల్ వర్మ

Published: Wednesday January 11, 2023

 

బోనకల్, జనవరి 9 ప్రజాపాలన ప్రతినిధి: పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా కేంద్ర సహాయ మంత్రి బి ఎల్ వర్మ, జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ తో కలసి జిల్లాలో పలు మండలాల్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా మంగళవారం మండలంలోని బోనకల్ స్టేషన్ రావినూతల మహాత్మ జ్యోతిబాపూలే (ఎంజేబీసీ) గురుకుల పాఠశాలలో విద్యార్థులు గౌరవ వందనంతో, ఉపాధ్యాయులు పుష్పగుచ్చాలతో మంత్రికి స్వాగతం పలికారు. ఈ పాఠశాల ను సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందని, విద్యార్థులు ఒత్తిడి లేని విద్యను అభ్యసించాలని, పరీక్షలను పండగలాగా ఆనందిస్తూ ఎదుర్కోవాలని మంత్రి తెలిపారు. నరేంద్ర మోడీ సర్కార్ చాయ్ పే చర్చ లాగా పరీక్ష పే చర్చ కార్యక్రమాలు చేపడుతూ విద్యావిధానాలలో గణనీయమైన మార్పులు తీసుకొస్తున్నారని వెల్లడించారు. ముందుగా బోనకల్, మధిర బిజెపి నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు వీరపనేని అప్పారావు, బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్ బీపీ నాయక్, బిజెపి నాయకులు జంపాల రవి, తాళ్లూరి సురేష్, కారంగుల మురళీకృష్ణ, సుమన్ బాబు, మరీదు పరశురాముడు, బిజెపి సీనియర్ నాయకులు మందపల్లి పాపారావు, గంగుల నాగేశ్వరరావు, ఇతర మండల నాయకులు,మధిర నియోజకవర్గ నాయకులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.బోనకల్, జనవరి 9 ప్రజాపాలన ప్రతినిధి: పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా కేంద్ర సహాయ మంత్రి బి ఎల్ వర్మ, జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ తో కలసి జిల్లాలో పలు మండలాల్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా మంగళవారం మండలంలోని బోనకల్ స్టేషన్ రావినూతల మహాత్మ జ్యోతిబాపూలే (ఎంజేబీసీ) గురుకుల పాఠశాలలో విద్యార్థులు గౌరవ వందనంతో, ఉపాధ్యాయులు పుష్పగుచ్చాలతో మంత్రికి స్వాగతం పలికారు. ఈ పాఠశాల ను సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందని, విద్యార్థులు ఒత్తిడి లేని విద్యను అభ్యసించాలని, పరీక్షలను పండగలాగా ఆనందిస్తూ ఎదుర్కోవాలని మంత్రి తెలిపారు. నరేంద్ర మోడీ సర్కార్ చాయ్ పే చర్చ లాగా పరీక్ష పే చర్చ కార్యక్రమాలు చేపడుతూ విద్యావిధానాలలో గణనీయమైన మార్పులు తీసుకొస్తున్నారని వెల్లడించారు. ముందుగా బోనకల్, మధిర బిజెపి నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు వీరపనేని అప్పారావు, బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్ బీపీ నాయక్, బిజెపి నాయకులు జంపాల రవి, తాళ్లూరి సురేష్, కారంగుల మురళీకృష్ణ, సుమన్ బాబు, మరీదు పరశురాముడు, బిజెపి సీనియర్ నాయకులు మందపల్లి పాపారావు, గంగుల నాగేశ్వరరావు, ఇతర మండల నాయకులు,మధిర నియోజకవర్గ నాయకులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.