దళిత బందు ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలి

Published: Tuesday August 17, 2021

ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి జూలై 15 (ప్రజాపాలన) : రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ దళిత సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు కోనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట చేపడుతున్న ఈ దీక్షలు ఆదివారం 6వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు రేగుంట సాగర్ మాట్లాడుతూ దళిత బంధు పథకాన్ని ఈ నెల 15 లోపు హుజురాబాద్ లో అమలు చేయాలని ఈ నెల 31లోగా రాష్ట్రమంతటా దళిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఇవ్వాలని, రేషన్ కార్డులు మహిళల పేర్లతో ఉన్నాయి కనుక ఈ దళిత బంధు పథకం మహిళల అకౌంట్ పేరుతో ఎలాంటి నిబంధనలు లేకుండా రైతుబంధు పథకానికి ఎలాంటి నిబంధనలు లేకుండా రైతు బంధుని అమలు చేస్తున్నారో అదేవిధంగా దళిత బంధు పథకాన్ని కూడా అమలు చేసి10 లక్షలు జమ చేయాలన్నారు. ఎస్సీ లోని 59 ఉప కులాలకు ఈ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆరవ రోజు దీక్షలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు రేగుంట సాగర్ మాదిగ, విష్ణు మోహన్, శ్యామ్ రావు, తిరుపతి, కృష్ణ సత్తయ్య, అన్ని కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.