పట్టుదల నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది డా కోట రాంబాబు ఎరుపాలెం సెప్టెంబర్ 8 ప్రజా పాలన ప

Published: Friday September 09, 2022
స్వచ్ఛ గురుకులాలు" కార్యక్రమంలో భాగంగా ఎర్రుపాలెం గురుకుల పాఠశాలను సందర్శించిన తెలంగాణ గురుకుల జాయింట్ సెక్రటరీ శ్రీ మతి కె. శారద  మరియు డా.కోట రాంబాబు కార్యక్రమ అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డా.కోట రాంబాబు.స్వచ్ఛ గురుకులాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు  ఎర్రుపాలెం గురుకుల పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా  టీఆరెఎస్ పార్టీ జిల్లా నాయకులు *డా. కోట. రాంబాబు హాజరయ్యారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డా. కోట రాంబాబు  మాట్లాడుతూ  నేటి విద్యార్థులు చదువుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. పేదరికం ఎదుగుదలకు అడ్డు కాదు అని ఎంత నిరుపేద కుటుంబంలో పుట్టినా కష్టపడి చదివి ఉన్నతమైన స్థాయికి చేరుకోవచ్చు అని  మీ తల్లి దండ్రులు మీ మీద ఎన్నో ఆశలతో మిమ్మల్ని ఇక్కడ చదివిస్తున్నారు అని, టీఆరెఎస్ ప్రభుత్వం గురుకులాల అభివృద్ధికి పెద్ద పీట వేసింది అని తద్వారా లక్షల మంది ఎస్సీ ఎస్టీ బిసి, మైనారిటీ విద్యార్థులు చదువుకొని ఉన్నతమైన స్థితికి వస్తున్నారు అని తెలియజేసారు. ఎక్కడా లేని విధంగా గురుకులాల్లో సుదుపాయలు వున్నాయి అని విద్యార్థులు అంతా వాటిని వినియోగించుకొని ఉన్నత స్థానాలకు వెళ్ళాలని ఆశించారు. వాతావరణం లో వచ్చే మార్పులకు అనుగుణంగా వచ్చే వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని కోరారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో ఎర్రుపాలెం సర్పంచ్ మొగిలి అప్పారావు , పేరెంట్స్ కమిటీ చైర్మన్ కోట లోకేష్ , తిరుపతయ్య , పాఠశాల  ఉపాధ్యాయినిలు,సిబ్బంది, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు