చిన్నారిని ఆశీర్వదించిన పొంగులేటి, మట్టా రాగమయి..

Published: Monday March 13, 2023

 తల్లాడ, మార్చి 12 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలం కొత్త వెంకటగిరి* గ్రామంలో రుద్రాక్ష రామకృష్ణ చారి వారి కుమారుడు రుద్రాక్ష పవన్-చందన దంపతుల  కుమారుడు *రీవాన్ష్ తేజ్* కి *అన్నప్రాసన* వేడుక ఆదివారం వారి స్వగృహలో జరిగింది.ఈ కార్యక్రమానికి మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రముఖ వైద్యురాలు మట్టా రాగమయి హాజరై చిన్నారిని *అక్షింతలు* వేసి దీవించారు. కార్యక్రమంలో *గోపిశెట్టి వెంకటేశ్వర్లు, తుమ్మలపల్లి రమేష్, నారపోగు వెంకటేశ్వర్లు,పొన్నం కృష్ణయ్య, దీవెల వెంకటేశ్వర్లు, దిరిశాల వీరభద్రం, దిరిశాల సత్యం  వెంకట రామయ్య, కొలిపాక శ్రీనివాసరావు, మల్లెల వెంకట చారి, యాకూబ్ పాషా ఉన్నారు.