ఘనంగా మహాత్మా గాంధీ 75వ వర్ధంతిని

Published: Monday January 31, 2022

నివాళులు మధిర జనవరి 30 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం, ఆతూకూరు గ్రామంలో, లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పెరుమలపల్లి విజయరాజు మాట్లాడుతూ అహింసా ఆయుధాన్ని చేపట్టి ప్రపంచ చరిత్రను కీలక మలుపు తిప్పిన అసమాన యోధుడు మహాత్మా గాంధీ. సేవా నిరతి, క్షమాగుణం, క్రమశిక్షణ వంటి నైతిక విలువలతో కూడిన గాంధేయవాదం మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా తదితరులను ప్రజా ఉద్యమ సేనానులుగా రాటుతే లింది. గాంధీజీ సత్యాగ్రహ శస్త్రధారి, మహా వక్త, మహోన్నత సంఘ సంస్కర్త. ఇరవయ్యో శతాబ్దాన్ని అమితంగా ప్రభావితం చేసిన శాంతి సమర శీలి. కర్తవ్య బోధన కన్నా కార్యాచరణ గొప్పదని నమ్మిన మానవీయ మూర్తి. దేశాన్ని ఏకతాటిపై నడి పించిన అద్భుత స్ఫూర్తి. 'మనం రగిలించాల్సింది మత ద్వేష కీలలను కాదు... మత సామరస్య జ్యోతులను' అని అపరహం బోధించిన గొప్ప నాయకుడు. సత్యం ఊపిరి పీల్చినంత కాలం ఆయన అమరుడు. తామరాకు మీద నీటి బొట్టులా ఉండటం, తామరాకు లోపల పత్రహరితంగా మారడం గాంధీజీకి వెన్నతో పెట్టిన విద్య. అని కొనియాడారుకార్యక్రమంలో, పాపట్ల రమేష్ గుండా చంద్రశేఖర్ రెడ్డీ, కొప్పురావూరి రామా యోగేశ్వరావు గారు. రామిశెట్టి నాగేశ్వరావు. సిలివేరు సాంబశివరావు నాళ్ళ సురేష్. పెరుమాళ్లపల్లి విద్యాసాగర్. పెరుమాళ్లపల్లి మోహనరావు. నల్లపు విల్సన్. తదితరులు పాల్గొన్నరు.