బతుకమ్మ చీరల పంపిణీ

Published: Wednesday October 06, 2021
వలిగొండ, అక్టోబర్ 05, ప్రజాపాలన ప్రతినిధి : మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో మరియు మండలంలోని వివిధ గ్రామాలలో సర్పంచ్ ల ఆధ్వర్యంలో గ్రామపంచాయితి కార్యాలయాలలో మంగళవారం మహిళలకు  బతుకమ్మ కానుకగా ప్రభుత్వం అందజేస్తున్న చీరలను పంపిని చేశారు. మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఎంపిపి నూతి రమేష్ చీరల పంపిణీ చేసి అనంతరం మాట్లాడుతూ బతుకమ్మ పండుగ ప్రతి ఆడపడుచు ఆత్మగౌరవంతో జరుపుకోవాలని ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసీ వాకిటి పద్మా ఆనంత రెడ్డి, వైస్ ఎంపిపి బాతరాజు ఉమా భాలనర్సింహ, స్థానిక సర్పంచ్ బొల్ల లలితా శ్రీనివాస్, ఉపసర్పంచ్ మైసోళ్ల మత్స్యగిరి, ఎంపిటిసి లు పలుసం రమేష్, కుందారపు యశోదా కొమురయ్య, పల్లెర్ల భాగ్యమ్మ రాజు, తహశీల్దార్ నాగలక్మి, ఎంపిడిఓ గీతా రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కునపురి కవిత, పనుమటి మమత నరేందర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్ లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.